04-02-2026 02:13:19 AM
వేములవాడలో క్యాష్ ప్రైజ్లు గెలుచుకున్న విద్యార్థులు
వేములవాడ,ఫిబ్రవరి 3,(విజయక్రాంతి) శ్రీ చైతన్య స్కూల్ వేములవాడలో నిర్వహించిన క్యాట్ పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. గత నెల నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు సెకండ్ లెవెల్లో కూడా ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ పరీక్షల్లో వేములవాడకు చెందిన పలువురు విద్యార్థులు క్యాష్ ప్రైజ్లు గెలుచుకోవడం విశేషం.ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సుదేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు పోటీ పరీక్షల ద్వారా ప్రతిభను చాటుకునే అవకాశాలు కల్పిస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు.
భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఇలాంటి పరీక్షల్లో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్ర మంలో ఏజీఎం ముద్రకోల రాజు, అకాడమిక్ కో-ఆర్డినేటర్లు ప్రవీణ్, మమత, ప్రిన్సిపాల్ సుదేష్ కుమారి, డీన్ అంజయ్య, సీ-బ్యాచ్ ఇన్చార్జ్ అరుణ్ కుమార్, ప్రైమరీ ఇన్చార్జ్ రజిత, ప్రవళిక, ప్రీ-ప్రైమరీ ఇన్చార్జ్ యషస్విని, హరీష్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆకునూరి సుధీర్, పీటీ సుధాకర్, మారుతి, కవితతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.