11 May, 2026 | 5:03 AM

ఆధ్యాత్మిక వారధి శ్రీశ్రీ రవిశంకర్

11-05-2026 03:42 AM
  1. గురుదేవుల వందేళ్ల వేడుకలకు మళ్లీ వస్తా
  2. ధ్యాన మందిరంతో భవిష్యత్ తరాలకు శాంతి
  3. ప్రధాని నరేంద్ర మోదీ
  4. మోదీ హయాంలో దేశంలో అద్భుత మార్పు
  5. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ 

బెంగళూరు, మే 10: భారతదేశ ప్రాచీన ఆధ్యాత్మిక వారసత్వానికి ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ సజీవ రూపమని, వారధిగా నిలుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గురుదేవుల వందేళ్ల వేడుకలకు మళ్లీ వస్తానన్నారు. అత్యున్నత స్థాయి ఈ ‘ధ్యాన మందిరం భవిష్యత్ తరాలకు శాం తిని ప్రసాదిస్తుందన్నారు. ఆధ్యాత్మికత, టెక్నాలజీ కలయికతో బెంగళూరు నగరం భారత దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పిందని మోదీ స్పష్టం చేశారు.

మోదీ హ యాంలో దేశంలో అద్భుత మార్పు చూ స్తోందని, యాచించే స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచానికి ఇచ్చే స్థాయికి భారత్ ఎదిగిందని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ తెలిపారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ఆదివారం జరిగిన సంస్థ 45వ వార్షికోత్సవాలకు ఆదివారం ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా నిర్మించిన అత్యున్నత స్థాయి ‘ధ్యాన మందిరాన్ని’ ప్రారంభించారు. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సం దర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జ్ఞానాన్ని, శాంతిని, ఆశను పంచే భారతదేశ ప్రాచీన సంప్రదాయానికి శ్రీశ్రీ రవిశంకర్ ఒక సజీవ రూపమని ప్రధాని కొనియాడారు. గురుదేవుల వందేళ్ల వేడుకల సమయానికి తాను మళ్లీ ఇక్కడికి వస్తానని మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఈ ధ్యాన మందిరం రాబోయే తరాలకు శాంతిని ఇచ్చే కేంద్రంగా మారుతుందన్నారు. ఆధ్యాత్మికత, టె క్నాలజీ కలయికతో బెంగళూరు నగరం దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిందని ప్రశంసించారు.

అయితే గడిచిన పదేళ్ల కాలంలో దేశం అద్భుతమైన మార్పును చవిచూసిందని ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పుడు యాచించే దేశం నుంచి ప్రపంచానికి ఇచ్చే దేశంగా ఎదిగిందని ప్రశంసించారు. 

కాన్వాయ్ మార్గంలో జిలెటిన్ స్టిక్స్

 ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటనలో భారీ భద్రతా లోపం బయటపడింది. మోదీ కాన్వాయ్ మార్గంలో జిలెటిన్ స్టిక్స్ దొరికాయి. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లీవింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవం, శ్రీశ్రీ రవిశంకర్ 70వ పుట్టినరోజు వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనడానికి హెచ్‌ఏఎల్ విమానాశ్రయం నుంచి బెంగళూరు సౌత్ జిల్లాలోని తాత్కాలిక హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అయితే ప్రధాని ప్రయాణించే మార్గంలో పోలీసులు రెండు జిలెటిన్ స్టిక్స్‌న్ గుర్తించారు.

మోదీ కాన్వాయ్ ఆ ప్రాంతం గుండా వెళ్లడానికి కేవలం అరగంట ముందు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.