ఇటిక్యాలలో నిఘా నేత్రాలు
12-08-2026 01:19 PM
జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో సర్పంచ్ దీన రాజలింగం ప్రత్యేక చొరవతో సిసి కెమెరాలు ఏర్పాటు చేసారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ ఐ కృష్ణారెడ్డి హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ సి సి కెమెరా లతో నేరలను నియంత్రించవచ్చు అన్నారు. ఒక్కో సి సి కెమెరా వంద మంది పోలీస్ లకు సమానం అని గ్రామాలలో వ్యాపారులు దుకాణ సముదాయలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఇటిక్యాల సర్పంచ్, ఉప సర్పంచ్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దిన రాజలింగం, ఉప సర్పంచ్ నరేష్, మాజీ జడ్పిటిసి లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా,వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.






