15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడపగడపకూ వెళ్లాలి

24-12-2025 12:00 AM

18 గ్రామాల కాంగ్రెస్ సర్పంచ్‌లకు సన్మానం

నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని 18 గ్రామాల కాం గ్రెస్ పార్టీ సర్పంచులకు, ఉపసర్పంచులకు,వార్డు మెంబర్లకు నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువులతో సన్మానించడం జరిగిందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, ప్రధా న కార్యదర్శి దివిటి కిష్టయ్య,సీనియర్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలోని ప్రతి గడపగడపకు వెళ్లాలని తెలిపారు.

అలాగే గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలని గ్రామాలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి తీర్చిది ద్దాలన్నారు. గ్రామాల్లో ఎలాంటి ఒడిదడుగులు ఏర్పడిన తమ దృష్టికి తీసుకురా వాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పని చేయకూడదని అన్నారు. గ్రామంలో ఎవరైనా తమ సమస్య గురించి వస్తే సంపూర్ణంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. గ్రామం లో ప్రతి సమస్యపై స్పందించి పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలన్నారు.

గ్రామాల్లో విద్య,వైద్యం, త్రాగునీరు, మురికి కాల్వలు, వీధి దీపాలు, పారిశుధ్య పనులు, రహదారులు, చెరువుల అభివృద్ధి మౌలిక సదుపా యాల అంశాలపై దృష్టి సాధించాలన్నారు. గ్రామాల్లో పాలకవర్గం ఐక్యమత్యంతో అన్ని అంగుళాలతో గ్రామాల అభివృద్ధిదేంగా పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు యాద గౌడ్, శంకర్, వెంకట్ గౌడ్, సంజీవరావు, భాగ్యశ్రీ, సురేష్,రోజా, పద్మ, సాయిలు, శ్రీనివాస్ గౌడ్, ప్రభుగౌడ్, ఉప సర్పంచులు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, తాండూర్ సొసైటీ మాజీ గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి కిష్టయ్య,సీనియర్ రామచంద్ర రెడ్డి, విట్టల్ రెడ్డి, వాసురెడ్డి, బాల్ రెడ్డి, నిరు డి రాజు, కోనేరు కుమార్, శ్రీరామ్ గౌడ్, సుభాష్ రెడ్డి, గంపల వెంకయ్య, జీవరత్నం, వస్రం నాయక్, రవి గౌడ్, హనుమంత్ రెడ్డి, మురళి గౌడ్, ప్రభాకర్,సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.