19 May, 2026 | 3:58 AM

ఆర్‌జేసీలో గీతాంజలికి రాష్ట్ర ర్యాంకులు

19-05-2026 12:00 AM

ఖమ్మం, మే 18(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన టీఎస్ ఆర్‌జేసీ ప్రవేశ పరీక్షలో ఖమ్మం శ్రీనివాసనగర్‌లోని గీతాంజలి పాఠశా విద్యార్థులు ర్యాంకుల ప్రభంజానాన్ని సృష్టించారు. గీతాంజలి పాఠశాల విద్యార్థి యు. వేదాద్రి ఎంపీసీ విభాగంలో 129/150 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును, ఎస్. సాన్విత 127/150 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకును సాధించి ర్యాంకుల సునామీ సృష్టించారు. అదేవిధంగా ఎం.యశశ్వితి రాష్ట్ర స్థాయిలో ౫౦వ ర్యాంకును, పి.సాయిచరణ్  రాష్ట్రస్థాయిలో 259వ ర్యాంకును, పి.సృష్టి రాష్ట్రస్థాయిలో 285వ ర్యాంకును, పి.మణికంఠ రాష్ట్రస్థాయిలో 1478వ ర్యాంకును సాధించారు. సంచలన ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ టీవీ అప్పారావు, డైరెక్టర్లు టి.పద్మ, టి.అరుణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.