2 March, 2026 | 2:47 AM

ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి

02-03-2026 01:02 AM

ఆదిలాబాద్, మార్చి ౧ (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి స్వామీజీ పేర్కొన్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి చేపడుతున్న ధార్మిక కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదిలాబాద్‌లోని అశోక్ రోడ్, రాంనగర్, శాంతినగర్, ఖానాపూర్ తదితర కాలనీలకు చెందిన మహిళలు సమితిలో చేరారు.

ఈ సం దర్భంగా సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి మాట్లాడుతూ... గత 13 సంవత్సరాలుగా తామ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్తీక దీపోత్సవం, కుంకుమార్చన, దసరా ఉత్సవాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రజల నుండి ఆదరణ లభిస్తుందన్నారు. తమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ కాలనీలకు చెందిన మహిళల తో పాటు మాజీ సైనికులు సమితి లో చేరి వారి చేయూత నివ్వడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు సమితి సభ్యులు పాల్గొన్నారు.