పట్టణ అభివృద్ధికి సూచనలు ఇవ్వండి
02-03-2026 01:03 AM
నిర్మల్, మార్చి ౧ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ రాష్ట్రంలోని ఆదర్శవంతమైన అభివృద్ధి మున్సిపాలిటీగా మార్చేందుకు ఉద్యోగులు సలహాలు ఇస్తే తప్పకుండా పాటిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమం పాల్గొన్నారు.
పట్టణంలో ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగులు మున్సిపాలిటీలో ప్రజల అవసరాలను గుర్తించి తమకు సూచనలు చేస్తే వాటిని అమలు చేసి ప్రజల అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ ఉద్యోగ సంక్షేమం సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.




