calender_icon.png 3 February, 2026 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరింత తగ్గిన బంగారు, వెండి ధరలు

03-02-2026 01:50:05 AM

హైదరాబాద్‌లో తులం పసిడి రూ.1.48 లక్షలు, వెండి  2.48లక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: బంగారు, వెండి ధరలు మరింత తగ్గాయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం తులం పసిడి 1.80లక్షలు, కిలో వెండి రూ.2.48 లక్షలకు చేరాయి. అంతర్జాతీయ అనిశ్చితి, షేర్‌మార్కెట్ ఒడిదుడుకుల రీత్యా వీటి ధరలు ఇటీవల భారీస్థాయిలో పెరిగగా కొనుగోలుదారులు కూడా బెంబేలెత్తిపోయారు. బంగారం, వెండి ధరలు దిగువకు పడిపోతుండడంతో కొనుగోలుదారులకు మంచి అవకాశమే. అంతర్జాతీయ గోల్డ్ మార్కెటల్‌లో బంగారం ఔన్స్ ఆరు శాతం పతనమై 4,538 డార్లకు, కిలో వెండి 14.55 శాతం తగ్గి 74 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. దీంతో భారత్‌లోనూ, హైదరాబాద్‌లోనూ బంగారు, వెండి ధరలు దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.48లక్షలు, కిలో కిలో వెండి రూ.2.48లక్షలు పలికాయి.