21 April, 2026 | 11:44 PM

కొత్త రహదారి వెంట స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలి

16-05-2025 12:00 AM

యస్‌ఓ టూ జీయం శ్యామ్ సుందర్‌కు వినతి పత్రాన్ని అందించిన టీబీజీకేఎస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి   

మణుగూరు మే 15  ః రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఓసి 2,కె. పి యూ. జి మైన్ వైపు వెళ్ళే రహదారి మధ్యలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద రోడ్డు మరమ్మత్తు పనులను సింగరేణి యాజమాన్యం బుధవారం ప్రారంభించింది. ఈ క్రమంలో కె. సి హెచ్ పి మీ దుగా ఓ . సి 2 , కె. పి యూ జి మైన్ కు రాకపోకలు సాగించాలని సంబంధిత అధికారులు దారి మళ్లింపు చర్యలు చేపట్టారు .

కొత్తగా దారి మళ్లింపు చేపట్టిన కె. సి హెచ్. పి నుంచి దుర్గా క్యాంప్ వరకు కార్మికులు రాకపోకలు సాగించే రహదారి వెంట వీధిలైట్లు లేకపోవడంతో సెకండ్, నైట్ షిఫ్ట్ ల్లో రాకపోకలు సాగించే కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , అటవీ జంతువులు అధికంగా తిరిగే ప్రాంతం కావడం వల్ల వీధిలైట్లు అవసరం తప్పనిసరి అని కోరుతూ ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు ఎస్ ఓ టు జి ఎం శ్యాం సుందర్ కు వినతి పత్రాన్ని అందచేశారు..

కొత్తగా ఏర్పాటైన రహదారి వెంబడి విపరీతమైన దుమ్ము ధూళి కణాలు కూడా లేస్తున్నాయని వాటి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.. రహదారి మధ్యలో గుంతలు ఏర్పడ్డాయని వర్షం ఏర్పడితే ఆ గుంతల్లో నీరు చేరి విధుల రాకపోకలకు సాగించే వారికి ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం లేకపోలేదని తెలిపారు.

రానున్న వర్షాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని కార్మికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అండర్ బ్రిడ్జి కింద రోడ్డు మరమ్మత్తుల పనులకు నిధులు మంజూరు చేసిన ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ కు తోడ్పాటు అందించిన ఏ జి యం సివిల్ వెంకటేశ్వర్లు కు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో నాయకులు పవన్ కుమార్, రమేష్ శ్రీనివాస్, రఫీ తదితరులు పాల్గొన్నారు.