21 April, 2026 | 10:21 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, మరొకరికి గాయాలు

16-05-2025 12:00 AM

ముషీరాబాద్, మే 15 (విజయక్రాంతి): నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చోటుచేసుకుంది.  స్పోరట్స్ బైక్ వేగంగా డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. కూకట్ పల్లికి చెందిన ఉషా శ్రీ (21), అభిషేక్ (21)లు స్నేహితులు.

బుధవారం రాత్రి హిమాయత్ నగర్ స్ట్రీట్ నెం.14లోని స్నేహితుడి ఇంట్లో జరిగిన పార్టీకి ఉషాశ్రీ, అభిషేక్ లు హాజరయ్యారు. తిరిగి గురు వారం ఉదయం అభిషేక్ తన స్పోరట్స్ బైక్ వేగంగా డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదంలో ఉషాశ్రీ  తల రోడ్డుకు బలంగా తగలడంతో తీవ్ర రక్తస్రావం, అభిషేక్ కు తీవ్ర గా యాలు కావడంతో వెంటనే వారిని స్థానికులు హైదర్ గూడ అపోలో హాస్పిటల్ కు తరలించారు.

చికిత్స పొందుతూ ఉషాశ్రీ మృతి చెందగా అభిషేక్ కు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంద ని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై నారాయణగూడ పోలీసులు కే సు నమోదు చేసి, ఉషాశ్రీ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉసా ్మనియా దవాఖానకు తరలించారు.