calender_icon.png 21 February, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ పాటించకపోతే కఠిన చర్యలు

21-02-2026 12:00:00 AM

సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి.

కొండపాక, ఫిబ్రవరి 20: వెలికట్ట గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి. కొండపాక మండలం వెలికట్ట ప్రాథమికోన్నత పాఠశాల  ను మధ్యాహ్న భోజన ప్రక్రియను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి. పాఠశాలలో వండిన అన్నం పప్పు ఆలుగడ్డ టమాట కూరలను పరిశీలించి, నేను ప్రకారం సాంబారు ఎందుకు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు.

కామన్ డైట్ మెనూ ను పాటిస్తున్నారా లేదా పాటించని యెడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల వాతావరణం చాలా బాగుందని అన్నారు. కానీ విద్యార్థుల అడ్మిషన్లు 29 మంది మాత్రమే ఉన్నారని ఆశించిన స్థాయిలో లేనందున అసహనం వ్యక్తం చేసి, వచ్చే విద్యా సంవత్సరం గ్రామంలో తిరిగి ఎక్కువ మొత్తంలో అడ్మిషన్లు పెంచాలని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను ఆదేశించారు.