calender_icon.png 21 February, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి సహకరిస్తా

21-02-2026 12:00:00 AM

నూతన పాలకవర్గంతో కలెక్టర్ పి.ప్రావీణ్య హామీ

టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలెక్టర్ ను కలిసిన పాలకవర్గం

సంగారెడ్డి, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్ పి.ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు ఆమె అభినందనలు తెలియజేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల ఇచ్చిన మాట మేరకు సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు మేం కట్టుబడి ఉన్నామని వారు కలెక్టర్ కు వివరించారు.

మెరుగైన పారిశుద్ధ్యం, ఇంటింటికి స్వచమైన తాగునీరు, సీసీ రోడ్లు, ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. సంగారెడ్డి మున్సిపల్ పాలకవర్గంలో యువతీ, యువకులు ఎక్కువగా ఉన్నారని, ఇది మున్సిపాలిటీకి చాలా ప్రయోజనం చేకూరుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని పాలకవర్గానికి ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శితో పాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ షఫీ హఫిజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొంగుల రవి, కూన సంతోశ్, కౌన్సిలర్లు శ్రీకాంత్, ప్రశాంత్ రెడ్డి, రవి నాయక్, గుర్రం ఝాన్సీ, మోతే శ్యామ్, వీణ తదితరులు పాల్గొన్నారు.