నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
11-03-2026 12:19 AM
అలంపూర్ మార్చి 10: మానవపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్య క్తులు పశువుల పేడ కొట్టడం వంటి చేష్టలు చేసిన నిందితులపై పోలీస్ అధికారులు గుర్తించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ తాలుక బాధ్యులు జయరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామంలో ని అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక గ్రామ స ర్పంచ్ రజాక్ తో కలిసి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కాళీ సురేష్, తదితరులు పాల్గొన్నారు.




