11 March, 2026 | 1:59 AM

యువత క్రీడలపై దృష్టి సారించాలి

11-03-2026 12:19 AM

క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

ఘట్ కేసర్, మార్చి 10 (విజయక్రాంతి) : యువత క్రీడలపై దృష్టి సారించాలని, క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు తమ సొంతం అవుతుందని బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చామకూర భద్ర రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, చామకూర కల్పన దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం (గోల్డెన్ జూబ్లీ) పురస్కరించుకుని ఘట్ కేసర్ సర్కిల్,

8వ డివిజన్ పోచారం పరిధి  కొర్రెముల వెంకటాద్రి టౌన్ షిప్ సమీపంలో బిఆర్‌ఎస్ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్యఅతిథిగా బిఆర్‌ఎస్ యువనేత చామకూర మల్లారెడ్డి తనయుడు చామకూర భద్రారెడ్డి హాజరై మంగళవారం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 65 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టుకు మూడు లీగ్ మ్యాచ్లు ఆడే అవకాశం కల్పించారు. క్రీడాకారులందరికీ ప్రత్యేకమైన టీ-షర్ట్లను పంపిణీ చేశారు.

ఈటోర్నమెంట్ లో ట్రోపీతో పాటు మొదటి బహుమతి లక్ష రూపాయలు నగదు, రెండవ బహుమతి యాభైఐదు వేల రూపాయలు నగదుగా నిర్ణయించారు. ఈసందర్భంగా చామకూర భద్రారెడ్డి మాట్లాడుతూ యువతపై మల్లారెడ్డికి ఉన్న ప్రత్యేక ప్రేమను చాటిచెప్పేలా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎండను సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో యువత ఈ క్రీడల్లో పాల్గొనడం విశేషమని, ముఖ్యంగా మల్లారెడ్డి అభివృద్ధిని గుర్తించి కల్పన మల్లారెడ్డిల 50వ వివాహ వసంతం సందర్భంగా సామల సందీప్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు.

ఈకార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్లు, జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, మాజీ కార్పొరేటర్ లు మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ లు, పార్టీ ముఖ్య నాయకులు నాగులపల్లి రమేష్, పన్నాల కొండల్ రెడ్డి, మేకల నర్సింగరావు, పోత్నకని మల్లికార్జునరాజు, తదితరులు పాల్గొన్నారు.