24 June, 2026 | 2:32 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

బాల్యవివాహాలకు పాల్పడితే చర్యలు తప్పవు

30-04-2026 12:47 AM

 సర్పంచ్ పెద్దపంగ సైదులు 

 వేములపల్లి, ఏప్రిల్ 29 : గ్రామంలో బాల్యవివాహాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని సర్పంచ్ పెదపంగ సైదులు అన్నారు. బుధవారం మండల పరిధిలోని శెట్టిపాలెం గ్రామంలో బాల్య వివాహాల అనర్థాలపై ఎస్త్స్ర డి వెంకటేశ్వర్లతో కలిసి గ్రామస్తులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిశోర బాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకొని ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు బాలికలకు ఇవ్వకుండా జాగ్రత్త పడాలన్నారు.

చదువు రీత్యా ఫోన్లు అందించిన సెల్ ఫోన్ల వాడకంపై బాలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. సెల్ ఫోన్ లో వచ్చే వివిధ యాపుల ద్వారా అసభ్యకరమైన ఫోటోలు వీడియోలు రీల్స్ చూడడం ద్వారా బాలికలు అనర్ధాలకు గురవుతారని హెచ్చరించారు. కిషోర్ బాలికల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వారి నడవ నడవడికను గమనిస్తూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.