1 April, 2026 | 3:33 AM

రైతులను మోసగిస్తే కఠిన చర్యలు

17-06-2025 04:29 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులను మోసం చేస్తే ఫర్టిలైజర్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) హెచ్చరించారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణాన్ని తనిఖీ చేశారు. రికార్డులు, రసీదులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... విత్తనాలు అమ్మిన నకిలీ విత్తనాలను అంటగట్టిన చట్టరీత్య చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. షాపులలో అమ్మిన విత్తన ప్యాకెట్లకు సంబంధించిన రసీదును తప్పకుండా రైతుకు అందజేయాలని సూచించారు. మాయ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని వ్యవసాయ పనులకు అవసరమైన సామాగ్రి కొనుగోలు చేస్తే తప్పకుండా రసీదు తీసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ కవిత, వ్యవసాయ అధికారి మిలింద్ కుమార్, సిబ్బంది ఉన్నారు.