4 July, 2026 | 6:40 PM

విజయక్రాంతి ఎఫెక్ట్

04-07-2026 05:12 PM

మురుగు కాలువలో తాగునిటీ పైపులైన్ మరమ్మతులు

చేర్యాల,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ 4వ వార్డులో మురుగు కాలువలో తాగునీటి పైపులైన్  ఉన్నట్లు విజయక్రాంతి వార్త ప్రచురించింది. స్పందించిన 4వ వార్డు కౌన్సిలర్ నిమ్మ సుప్రజా రాజీవ్ రెడ్డి చొరవతో మున్సిపల్ అధికారులు  వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి మరమత్తు పనులు చేపట్టారు. పగిలి పోయిన భగీరథ పైపుకు మరమ్మతు పనులు చేపట్టారు. కలుషిత నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన విజయక్రాంతి రిపోర్టర్ కు, కౌన్సిలర్‌కు, మున్సిపల్ కమిషనర్ కు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.