4 July, 2026 | 6:56 PM

మొక్కలు నాటిన మున్సిపల్ వైస్ చైర్మన్

04-07-2026 05:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్లో శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల అవి ప్రజల ఆరోగ్యానికి మేలు కలిగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గౌతమి రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.