10 April, 2026 | 4:36 PM

Breaking News

సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •   మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్— లొంగిపోయిన 42 మంది కీలక మావోయిస్టులు   •   కాలభైరవ ఆలయంలో పూజలు   •  

ఇసుక, గంజాయి అక్రమ రవాణపై పటిష్ట నిఘా ఉంచాలి

17-04-2025 01:47 AM

పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

దాతల సహాకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తణిఖీలో సిబ్బందితో జిల్లా ఎస్పీ నరసింహా

పెన్ పహాడ్, ఏప్రిల్ 16 : ఇసుక, గంజాయి అక్రమ రవాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు పేట్రేగిపోకుండా పోలీసు సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి నప్పుడే ఈలాంటి అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్సీ నరసింహా సిబ్బందికి సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రములోని పోలీస్ స్టేషన్ ను అకస్మిక తణిఖీ నిర్వహించి సిబ్బందితో ముఖాముఖీ మాట్లాడారు.

ఈసందర్భంగా స్టేషన్ రికార్డులను, పరిసరాలను, వివిధరకాల నేరాలలో స్వాధీనం చేసుకున్న వహనాలు, ఫిర్యాదుల నమోదు ప్రాథమిక ధర్యాప్తలపై ఆరా తీశారు. విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది సమస్యలుంటే వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేసి పరిస్కారం దిశగా ముందుకు వెళ్ళాలన్నారు. అంతేకాకుండా సిబ్బంది బాధ్యతయుతంగా విధులు నిర్వర్తిస్తూ డయల్ 100 ఫిర్యాధులు, స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలపై అండగా ఉంటూ పరిస్కార మార్గంలో బాధితులతో బేష్ అనిపిం చుకోవాలన్నారు.

గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను పెంచుకోవడానికి మార్గంలో భాగంగా సమాచార వనరుల రూపొందించుకోవాలన్నారు. మండలంలో ఇసుక, గంజాయి అక్రమ రవాణ పటిష్టంగా నిరోదించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి కేసుల్లో ఉన్న నిందుతుల కదలికలపై ఆరా తీయాలన్నారు. జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ’పోలీసు-ప్ర జా భరోసా’ కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు.

ప్రజల్లో భద్రత పరమైన చైతన్యం తీసుకురావడానికి సిబ్బంది మేమున్నామంటూ భరోసా కల్పించేలా విధులు నిర్వ ర్తించాలన్నారు. గ్రామాలలో ప్రధాన కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్థుల సహకారం తీసుకోవాలని ఎస్‌ఐ గోపికృష్ణతోపాటు గ్రామ పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమములో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ గోపికృష్ణ. ఏఎస్‌ఐ రాము లు, హెడ్ కానిస్టేబుల్స్ మురళిధర్ రెడ్డి, యాదగిరి, సిబ్బంది తదితరులు ఉన్నారు.