ఉపాధి కూలీ సమ్మె సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఆగదు..
బీకేఎంయు ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దండు ఆదినారాయణ
సత్తుపల్లి(విజయక్రాంతి): తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు ఆధ్వర్యంలో ఉపాధి కూలీల సమస్యలపై దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సత్తుపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఉపాధి కూలీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో ఉపాధి కూలీలు ఆందోళన నిర్వహించి గ్రామపంచాయతీ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బి కే ఎం యు ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి దండు ఆదినారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి కూలీల పట్టగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే ఉపాధి హామీ పథకానికి నిధులు కోత పెట్టారని ఆయన విమర్శించారు.
ఉపాధి కూలీలకు రెండు పూటలా ఐరిస్ ఫోటో కారణంగా కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దీన్ని వెంటనే తీసేయాలని ఆయన డిమాండ్ చేశారు వీటితోపాటు కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి కనీస సౌకర్యాలు కల్పించి 200 రోజులు పనులు కల్పించి రోజు కూలి 600 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ప్రమాదవశాత్తు గాయపడిన వారికి లక్ష రూపాయలు చనిపోయిన వారికి పది లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించి జి.రాంజీ పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా మండల కేంద్రంలో సత్తుపల్లి ఎండిఓ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆయన కూలీల పక్షాన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎర్ర జల రాజశేఖర్ పాలకుర్తి వీరయ్య దండు జగన్ తాటి వీరభద్రం దండు యేసు రావు పిల్లి పిల్లి రాహేల్ తోట రాంబాబు యాగంటి సత్యనారాయణ కొల్లికుంట లక్ష్మయ్య కొండ కాంతయ్య కొండ సుజాత ఒంటెద్దు రాములమ్మ జయమ్మ సత్యవాణి లక్ష్మి బేబమ్మ 160 మంది పైగా కూలీలు పాల్గొన్నారు






