1 May, 2026 | 2:02 AM

బీసీ-ఈ ముస్లింల సమస్యలపై పోరాటం

01-05-2026 12:00 AM
  1. జూన్ 16న హైదరాబాద్‌లో మహాసభ
  2. బీసీ సమాజ్ జాతీయ సమన్వయకర్త పూర్ణచంద్రరావు

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): బీసీ--ఈ ముస్లింల సమస్యలపై రాష్ట్ర స్థాయి మహాసభను జూన్ 16న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు, జాతీయ సమన్వయకర్త డా. జె. పూర్ణచంద్రరావు, ఐపీఎస్ (రిటైర్డ్, డీజీపీ) వెల్లడించారు.

బీసీ--ఈ ముస్లింల సమస్యలు, హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం అంశాలపై గురువారం బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ సమన్వయకర్త డా. జె. పూర్ణచంద్రరావు, ఐపీఎస్ (రిటైర్డ్, డీజీపీ) ముఖ్యంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ--ఈ ముస్లింలు గణనీయమైన విజయాలు సాధించినట్లు తెలిపా రు.

తెలంగాణలో 138 మంది సర్పంచులు, 305 మంది ఉపసర్పంచులు, 2,508 మంది వార్డు సభ్యులు ఎన్నిక కావడం విశేషమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లింల జనాభా సుమారు 13 శాతం ఉన్నప్పటికీ కేవలం 7 మంది ఎమ్మెల్యేలు మాత్ర మే ఉండటం అన్యాయమని విమర్శించారు. బీసీ--ఈ వర్గాలకు చెందిన 14 కులాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయని, కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేలా ఉద్యమం చేపట్టాలని తీర్మానించారు.

తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 7 మంది ఎమ్మెల్యేలు ఉం డేలా లక్ష్యంగా పెట్టుకున్నారు. రిజర్వేషన్ల అ మలులో అసమానతలు ఉన్నాయని, ప్రస్తు తం ఉన్న 4% రిజర్వేషన్ సరిపోవడం లేదని పేర్కొన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబాటు, ప్రభుత్వ పథకాల అమలులో లోపా లు, సామాజిక-ఆర్థిక అసమానతలు ప్రధాన సమస్యలుగా చర్చించబడ్డాయి. కుల ధృవీకరణ పత్రాల జారీ విషయంలో తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయని నాయకులు తెలిపారు.

తహసీల్దార్ స్థాయి లో స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభు త్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. బీసీ--ఈ ముస్లిం ల సమస్యలపై రాష్ట్ర స్థాయి మహాసభను జూన్ 16న హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహిం చాలని నిర్ణయించారు.

సమావేశంలో మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ముస్లిం నాయకులు ఎండీ. షబ్బీర్, బడే సాబ్, యాకూబ్ సాబ్, షేర్ అలీ, హుస్సేన్ భాయ్, జమీల్, సయ్యద్, ఖాసిం పాషా, సలీం పాల్గొని పలు సూచనలు చేశారు. రిటైర్డ్ అదనపు కలెక్టర్ సూర్యనారాయణ, రిటైర్డ్ డీఈఓ విజయ్‌కుమార్ పాల్గొని చర్చించారు. బీసీ--ఈ ముస్లిం లకు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని, కుల ధృవీకరణ పత్రాల జారీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, విద్య, ఉపాధి రం గాల్లో ప్రత్యేక పథకాలు అమలు చేయాలని కోరారు.