వీహెచ్‌కు పలువురి అభినందన
01-05-2026 12:00 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ వి.హనుమంతరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించడం పట్ల జీహెచ్ ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్, సీనియర్ కాంగ్రెస్ నేత దిడ్డి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన డాక్టర్ వి. హనుమం తరావు మర్యాదపూర్వకంగా కలిసి బొకేను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
బీసీ సంక్షేమ శాఖ కు మంత్రి హోదాలో వి. హనుమంత రావును నియమిస్తూ ఉత్తర్వులు జారి చేయడం వర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.






