విద్యార్థి మృతి.!

26-09-2026 | 02:52pm

ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం పది విద్యార్థి మృతి.!

చిన్నపాటి జ్వరాన్ని కూడా గుర్తించక అలసత్వం

పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి నుంచి గెంటివేత

నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఆస్పత్రి నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని(Student) అకాల మరణం పొందింది. ఈ ఘటన ఈనెల 24న చోటు చేసుకోగా శనివారం ఆలస్యంగా వెలుగులు చూస్తుంది. జిల్లా కేంద్రంలోని సంత బజార్లో నివాసం ఉంటున్న నామ శాన్వి(16) ఓ ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజుల క్రితం సారి ఫంక్షన్ అనంతరం జ్వరం బారిన పడింది.

దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా సుమారు నాలుగు రోజుల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి పరిస్థితి విషమించాక హైదరాబాద్ వెళ్లాలని గెంటేసినట్లు బాధితురాలు తండ్రి ఆరోపించారు. నిమ్స్ ఆస్పత్రి(NIMS Hospital)లో చికిత్స పొందుతూ తమ బిడ్డ ప్రాణాలను వదిలిందని ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యురాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు