విద్యాసంస్థలపై బంద్ ప్రభావం
హైదరాబాద్: నేడు దేశవ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నీట్, నెట్ పరీక్ష పేపర్లు లీక్ అంశాలపై విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టారు. ఎన్డీఏను సంస్కరించాలనే డిమాండ్ తో విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు. బంద్ పిలుపుతో ఇప్పటికే పలు విద్య సంస్థలు సెలవు ప్రకటించాయి. నేటి విద్యాసంస్థల బంద్ కు సీపీఎం సంపూర్ణ మద్దుతు లెలిపారు. హైదరాబాద్‌లోని కొన్ని విద్యాసంస్థలు మూతపడేలా భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) గురువారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయకపోగా, కొన్ని విద్యాసంస్థలు బంద్‌కు సంబంధించి సందేశాలు పంపాయి. నీట్ పరీక్షలో అవకతవకలు, నెట్ పరీక్షను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కార్యవర్గం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.






