20-02-2026 12:00:00 AM
23 పతకాలతో రికార్డ్!
ఎల్బీనగర్ ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): చదువులోనే కాదు, క్రీడల్లోనూ తాము సాటిలేని మేటి అని నిరూపించుకున్నారు టీజీ ఎంరీస్ యాకుత్పురా విద్యార్థినులు. ఎల్‌బి. నగర్లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగిన 5వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్‌లో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థినులు అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాల పంట పండించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు భాను చందర్ పాల్గొ ని, విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేసి ఛాంపియన్షిప్ ట్రోఫీని బహూకరించారు.
హర్షం వ్యక్తం చేసిన పాఠశాల బృందం
అంతర్జాతీయ స్థాయిలో తమ విద్యార్థినులు రాణించడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ నసీమున్నిసా బేగం, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ, పట్టుదలతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఈ విద్యార్థినులు నిరూపించారని వారు కొనియాడారు.