20-02-2026 12:00:00 AM
ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): మన భారతదేశ మహారాజు, హిందూ సామ్రాజ్య స్థాపకులు, మొగలు గుండెల్లో భయం పుట్టించిన యోధులు మన హిందూ జాతి ఆత్మ గౌరవం శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారా జు అని ఎమ్మెల్యే రోహిత్ రావు కొనియాడారు. చత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్క రించుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని రాం దాస్ చౌరస్తాలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివాజీ మహారాజ్ మరాఠా ప్రజలలో స్వేచ్ఛా స్ఫూర్తిని రగిలించి, శక్తివంతమైన నౌకాదళాన్ని (భారత నౌకాదళ పితామహుడిగా పిలుస్తారు) అని చె ప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, కల్కి మహరాజ్, భిక్షూ మహరాజ్, కౌన్సిలర్ సంధ్య, చంద్రం, గోపాల్ నాయక్, కిషన్, దేవుల, హీరాలాల్, అశోక్, శ్రీను నాయక్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.