15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

గిరిజనులకు, లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది

20-02-2026 12:00 AM

ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ 

మెదక్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి) : గిరిజనులకు,లంబాడాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో సేవాలాల్ జయతి కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలకు, గిరిజనులకు, లంబాడాలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, మెదక్ నియోజకవర్గంలోని తండాల్లోని వివిధ రోడ్ల మరమ్మత్తుల కోసం రూ. 8 కోట్లు ఖర్చు చేసి అబివృద్ధి పనులు చేశామన్నారు.

మరింత గిరిజనుల, లంబడాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. లంబాడా వేషధారణలో విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, కల్కి మహరాజ్, భిక్షూ మహరాజ్, కౌన్సిలర్ సంధ్య, చంద్రం, గోపాల్ నాయక్, కిషన్, దేవుల, హీరాలాల్, అశోక్, శ్రీను నాయక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.