7 May, 2026 | 6:12 PM

విద్యార్థులు బడిలో.. తల్లిదండ్రులు పనిలో ఉండాలి

10-12-2024 07:33 PM

న్యాయమూర్తి కీర్తి చంద్రిక రెడ్డి...

ఇల్లెందు (విజయక్రాంతి): మానవ హక్కుల రోజును పురస్కరించుకొని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇల్లందు కోర్ట్ న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులు నిర్బంధ విద్య చట్టం అమల్లో ఉందని మైనర్లైన విద్యార్థిని విద్యార్థులను పనిలో పెట్టుకోకూడదని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా శిక్ష అర్హులవుతారని మనుషులకు భారత రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, పని స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు ఉన్నాయని అందరూ భారత రాజ్యాంగానికి హక్కులకు విధులకు వినియోగించుకోవాలని అతిక్రమించిన వారిపై చట్టరీత్యా శిక్షలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కొండ నారాయణ, కామేపల్లి ఉమామహేశ్వరరావు, ఎస్ వెంకటేశ్వర్లు, డి నాగమణి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.