అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి
అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి...
పటాన్‌చెరు: అభివృద్ధి విషయంలో అందరూ భాగస్వాములు కావాలని అమీన్‌పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం గండిగూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్‌తో కలిసి ఆయన పర్యటించారు. ఇటీవల అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించనున్నట్లు పాండు రంగారెడ్డి తెలిపారు. గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అవసరమైన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ప్రతిపాదనలు రూపొందించి నిధులు కేటాయిస్తామన్నారు. గ్రామానికి సంబంధించిన ఇతర సమస్యలు తన దృష్టికి తీసుకునిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుభాన్ రెడ్డి, రాములు గౌడ్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.






