7 May, 2026 | 5:26 PM

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలి

10-12-2024 07:29 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో అదనపు ఫైజాన్ హమ్మద్ తో కలిసి ఎల్ఆర్ఎస్ పథకంపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పట్టణాల్లో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.