రాష్ట్రస్థాయి వాలీబాల్ జట్టులో గొండ్రియల స్కూలు విద్యార్థులు
28-10-2024 11:29 AM
అనంతగిరి (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా అండర్ 14 ఇయర్స్ వాలీబాల్ బాలికల విభాగంలో సూర్యాపేట జిల్లా ప్రథమ బహుమతి పొందగా ఉమ్మడి జిల్లా తరపున రాష్ట్ర స్థాయికి గోండ్రియాల ఉన్నత పాఠశాల విద్యార్థినులు జి.నిహారిక, ఎం.సాహితిలు రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంతగిరి ఎంఈఓ శ్రీ తల్లాడ శ్రీనివాసరావు విద్యార్థుల్ని మెడల్స్ తో ఘనంగా సత్కరించారు, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల్ని అభినందించారు.




