17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి

02-06-2025 12:43 AM

జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ 

కొత్తగూడెం, జూన్ 1(విజయ క్రాంతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు పుస్తకాల పురుగులుగా మారుతున్నారని,అలా కాకుండా సాంస్కృతిక పోటీల్లో,క్రీడల్లో రాణించినప్పుడే వారు మానసిక ఉల్లాసంగా ఉంటారని జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని పద్మశాలి భవన్ లో రైసింగ్ స్టార్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి సూపర్ డాన్స్ సీజన్ -2 పోటీలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.

డాన్స్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉదయం నుంచి రాత్రి వరకు కేవలం పుస్తకాలకే ప రిమితం చేస్తున్నారన్నారు. ఇలా చేయడం వల్ల వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా ప్రతీ ఒక్కరిలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి తగిన శిక్షణను ఇస్తే అద్భుతాలు సృష్టించవచన్నారు.

ఎలాంటి బెరుకు లేకుండా చిన్నారులు అద్భుతంగా తమ నృత్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు. కొత్తగూడెం కళాకారులు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర,జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.సూపర్ డ్యాన్సర్ 1వ సిరీస్ వల్లే 2వ సిరీస్ పోటీలు చాలా చక్కగా నిర్వహించిన డాన్స్ మాస్టర్స్ కనకం ప్రవీణ్ కుమార్,సందెబోయిన సంపత్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు.

న్యాయనిర్ణేతలుగా *రచ్చ మధు,కడారి వెంకట్,భద్రాచలం శ్యామ్లు వ్యవహరించారు. ఈకా ర్యక్రమంలో ఎన్&ఆర్ ఫామ్ ల్యాండ్ అధినేత రామక్రిష్ణ,జేబీపీ జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు,కొప్పుల యశ్వంత్,మాజీ కౌన్సిలర్ రుక్మెందర్ బండారి తదితరులు పాల్గొన్నారు.