3 July, 2026 | 8:46 PM

Breaking News

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •  

సీనియర్ సర్జన్ జ్యోతిర్మయికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్‌గా నియామకం

02-06-2025 12:37 AM

హర్షం వ్యక్తం చేసిన టీబీజీకే యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి     

మణుగూరు జూన్ 1,(విజయ క్రాంతి): సంస్థ పట్ల అపారమైన గౌరవం వృత్తినే దైవంగా భా వించే తీరు,నీతి,నిజాయితీ ,క్రమశిక్షణ, పట్టుదల ద్వారా వైద్య వృత్తిలో అపారమైన అనుభవం గడించి మంచి పేరు ప్రఖ్యాతలు గడించిన మణుగూరు సింగరేణి ఏరియా హాస్పిటల్ సీనియర్ సర్జన్ వైద్యురాలు యం జ్యోతిర్మయి (డి వై సి యం ఓ) కు మణుగూరు సింగరేణి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ గా అదనపు బాధ్యతలు ఇస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేశారు.

నీతి నిజాయితీ క్రమశిక్షణ వృత్తిపట్ల గౌరవం కలిగిన డాక్టర్ జ్యోతిర్మాయికి ఏవో గా బాధ్యతలు అప్పగించటం పట్ల మణుగూరు ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లతరబడి ఆమె అందించిన నిస్వార్థమైన సేవలు నేటివరకు కార్మిక కు టుంబాలు మరువలేదన్నారు. సింగరేణి యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మణుగూరు ఏరి యా కార్మిక కుటుంబాలు సంతోషంగా స్వాగతిస్తున్నాయని ఆయన తెలిపారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మణుగూరు ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ మెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో సెంట్రల్, బ్రాంచి క మిటి నాయకులు ఇజ్రాయిల్, బంగారి పవన్ కుమార్, మునిగేల నాగేశ్వర రావు, ముకేశ్ కుమా ర్, రాజ్ కుమార్ పడ్డం శ్రీనివాస్, రమేష్ బాబు, ఫిట్ సెక్రటరీ లు వినయ్ కుమార్, నరేష్, రేవ న్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.