విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలి
05-05-2026 12:51 AM
కమాండెంట్ జయరాజు
ఎర్రవల్లి మే 4: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోనీ వాటిని సాకారం చేసుకోవాలని కమాండెంట్ జయరాజు తెలిపారు. సోమవారం రోజు 10వ బెటాలియన్లోని సాయుధ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల కోసం సక్సెస్ మీట్ కార్యక్రమం లో పాల్గొని 500కు పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థి విద్యార్థినులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ కమాండెంట్ పార్థసారథి రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నరసింహారాజు, శ్రీనివాసులు, రాజేశం, బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ మరియు ప్రిన్సిపాల్ షేక్షావల్లి, స్కూల్ ఇన్చార్జి ప్రసన్న కుమార్, వెంకట్ రెడ్డి ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.






