కామారెడ్డి డీఎస్పీగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ
05-05-2026 12:50 AM
మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిసిన డీఎస్పీ
కామారెడ్డి, మే 4 (విజయక్రాంతి): కామారెడ్డి ఏఎస్పీగా పని చేసిన చైతన్య రెడ్డి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది సంగారెడ్డికి బదిలీపై వెళ్లిన విషయం విధితమే. కామారెడ్డి డి.ఎస్.పి గా మధుసూదన్ బదిలీపై వచ్చారు. సోమవారం ఆయన బాధ్యతలను చేపట్టారు. అనంతరం ఎస్పీ రాజేష్ చంద్ర ను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ, డిఎస్పీ మధుసూదన్ ను అభినందించారు.






