14-02-2026 08:49:29 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): జిల్లాస్థాయిలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలలు క్రీడా పోటీల్లో వాలీబాల్ విభాగంలో జడ్పిహెచ్ఎస్ పెంచికల్పేట్ విద్యార్థులు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో జడ్పిహెచ్ఎస్ పెంచికల్పేట్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. 400 మీటర్ల పరుగుపందెంలో విద్యార్థి టి. సాయికుమార్ ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందారు. ఇదే విభాగంలో డి. దివాకర్ తృతీయ స్థానం సాధించారు.
అదేవిధంగా 600 మీటర్ల పరుగుపందెంలో సి.హెచ్. ఆకాష్ తృతీయ స్థానం సాధించి పాఠశాలకు మంచి పేరు తెచ్చారు. ఈ సందర్భంగా విజయాలు సాధించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.