14-02-2026 08:56:00 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని మహాగావ్ గ్రామంలో సంత్ సురూజీ బాబా ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహ మేళా కు వెడ్మ ఫౌండేషన్ ద్వారా రూ.50 వేల నగదు ను ఫౌండేషన్ వైస్ చైర్మన్ కోరంగ అక్షయ్ అందజేశారు. ప్రత్యేక మహా శివరాత్రి పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంత్ సురోజి బాబా ఆశ్రమం ఆధ్వర్యంలో పేద యువతి యువకులకు సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారు.
ఇది ప్రతి ఏడాది మాదిరిగానే మహాశివరాత్రి సందర్భంగా ఈ ఏడాది 25 జంటలకు సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక చొరవ తో ఫౌండేషన్ ద్వారా నగదు అందజేయాలని ఆదేశించారు. దీంతో ఫౌండేషన్ వైస్ చైర్మన్ కోరింగ అక్షయ్, సభ్యులు మెస్రం నగేష్, సర్పంచ్ మెస్రం భూపతి, సోయం ముకుంద రావు, మండడి లింగు లు శనివారం జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథునికి నగదు అందజేశారు.