8 July, 2026 | 12:23 PM

కూలీలో బైక్‌పై స్టుల్‌గా

18-12-2024 12:00 AM

రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా నుంచి ముఖ్య పాత్రలు పోషించిన వారికి సంబంధించిన ఒక్కొక్కరి లుక్‌ను చిత్ర బృందం విడుదల చేస్తోంది. ఇప్పటికే నాగార్జున లుక్‌ను వదిలిన చిత్ర యూనిట్ తాజాగా శ్రుతి హాసన్ లుక్‌నూ విడుదల చేసింది. బైక్‌పై స్టుల్‌గా కూర్చొన్న శ్రుతి లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.