8 July, 2026 | 11:11 AM

సీక్వెల్‌తో రానుంది..

18-12-2024 12:00 AM

కథానాయిక తాప్సీ ప్రధాన పాత్ర లో రూపొందిన చిత్రం ‘బద్లా’. మిస్టరీ అండ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, అజూర్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ‘ప్రతీసారి ప్రతీకారం తీర్చుకోవడం సరికాదు.. అలాగే ప్రతిసారీ క్షమించడం కూడా సరికాదు’ అనే ఒక మెసేజ్‌తో ఈ చిత్రం విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికీ ఈ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ‘బద్లా’కు సీక్వెల్‌ను రూపొందించే ఆలోచన చేస్తున్నట్టు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్టు తెలుస్తోంది. ‘బద్లా’ చిత్రంలో అమితాబ్ బచ్చన్, అమ్రితా సింగ్, మానవ కౌల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.