03-12-2025 04:33:25 PM
లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని స్థానిక ఎంఈఓ శైలజకు బుధవారం పిఆర్టియు టీఎస్ లక్షెటిపేట ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన తెలంగాణ రాజకీయ, ఆర్థిక, ఉపాధి, విద్యాకుల(ఎస్.ఈ.ఈ.ఈ.ఫీ.సీ) సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సెలవు రోజులలో పని చేసినందుకు సీసీఎల్ఎస్ మంజూరు చెయ్యాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట పిఆర్టియు గౌరవాధ్యక్షులు పింగిలి వేణుగోపాల్, అధ్యక్షుడు జే.తిరుపతి, కార్యదర్శి బండ రవీందర్, సభ్యులు జంబోజి కృష్ణకాంత్ పాల్గొన్నారు.