10 March, 2026 | 8:46 PM

పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు

10-03-2026 07:23 PM

నిర్మల్,(విజయక్రాంతి): సోన్ మండలం పాక్పట్ల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎన్.వెంకన్న మాట్లాడుతూ... విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను ప్రణాళికబద్ధంగా చదివి పరీక్షల్లో విజయం సాధించాలని, ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులు సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలకు కంప్యూటర్ సిస్టంను విరాళంగా అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం.చంద్రశేఖర రావు, తోడిశెట్టి రవికాంత్, గటిక రవికాంత్, జువ్వల శ్రీధర్, బలిరాం, అరుణ,రత్నాకర్, గ్రామస్తులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.