10 March, 2026 | 11:00 PM

ఆక్రమలను తొలగించి... ప్రభుత్వ భూములను కాపాడిన రెవెన్యూ శాఖ

10-03-2026 07:56 PM

స్థలాలకు ఫెన్సింగ్ వేసిన వారిపై చర్యలు తీసుకుంటాం

కాప్రా తాసిల్దార్ బైరెడ్డి రాజేష్

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కాప్రా తహసిల్దార్ బైరెడ్డి రాజేష్ హెచ్చరించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తాసిల్దార్ రాజేష్ ఆదేశాల మేరకు గిర్దవార్ సత్యనారాయణ సమక్షంలో మంగళవారం కూల్చివేతల చేపట్టారు.

ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ సర్కారు భూముల్లో ప్రైవేటు వ్యక్తులు ఫెన్సింగ్ వేయడం చట్ట విరుద్ధమని వారిపై చర్యలు తప్పవని అన్నారు. వేసిన ఫెన్సింగ్ ను కూల్చివేసి ప్రభుత్వ భూమిని కాపాడమని జవహర్ నగర్ లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.