27 August, 2026 | 4:10 AM

విజయవంతమైన పాఠశాలల బంద్

10-07-2026 02:48 PM

బోథ్,( విజయక్రాంతి): విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ పిడిఎస్యు వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం బోత్ నేరడిగొండ బజార్హత్నూర్ మండలాల్లో బంద్ విజయవంతమైంది. ప్రైవేట్ పాఠశాలలు ముందుగానే మూసి ఉంచడంతో ప్రభుత్వ పాఠశాలలో తెరిచి ఉంచారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకపోవడంతో బంద్ ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లో సైతం కనిపించింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి మున్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా విద్యారంగ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్తులో విద్యార్థులు ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కృష్ణ రాజు, రామ్ సాయి నిఖిల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.