28 June, 2026 | 12:51 AM

విద్రోహి గీతాలాపన

07-09-2025 12:00 AM

రవిప్రకాశ్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వీఎస్‌వీ దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి రెండోపాటను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు.

తాగుబోతు రమేశ్, మధునందన్, కోటేశ్వరరావు, జబర్దస్త్ బాబీ, రణ్వీర్ సాయి, ఆర్ కర్ణ, నవికేత్ పాటిల్, రాఘవేంద్ర పప్పుల, అన్వేష్ డీజే, మనమ్మ, దియా, మాధురి, సానియా, అనీష్ రామ్, ఆర్ జే నాయుడు, కృష్ణారావు, తడివేలు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిరోలియో; డీవోపీ: సతీశ్ ముత్యాల; లిరిక్స్: సురేశ్ గంగుల, దేవ్ పవార్, ఉమా వంగూరి; ఆర్ట్: రవిబాబు దొండపాటి; ఎడిటింగ్: ఉపేంద్ర, ఎంఎన్‌ఆర్; నిర్మాత: విజ్జన వెంకట సుబ్రహ్మణ్యం; స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, డైరెక్షన్: వీఎస్‌వీ.