1 June, 2026 | 12:57 AM

సుడా రెండేళ్ల ప్రగతి అద్భుతం

01-06-2026 12:22 AM
  1. రెండేళ్ల ప్రగతి పై జూన్ 1 నుండి జూన్ 15 వరకు పక్షోత్సవాలు 
  2. త్వరలో కమర్షియల్ బిల్డింగు,ఐడీఎస్‌ఎంటి అందుబాటులోకి 
  3. త్వరలో అంగారిక టౌన్‌షిప్‌కు అన్ని సౌకర్యాలు 
  4. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కరీంనగర్ క్రైం, మే31(విజయక్రాంతి) : శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రెండేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి జ రిగిందని రాబోయే రోజుల్లో ఇంకా మరింత ముందుకు సాగుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు.ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్ప టికే 183 పనులకు గాను కోట్లతో రోడ్లు డ్రైనేజీలు,స్ట్రీట్ లైట్లు,హైమాస్ లైట్లు,

కూడళ్ల సుందరీకరణ తదితర పనులు చేపట్టామని సుడాకు గతంలో గజం జాగ కూడా లేదని 800 గజాలలో 5 కోట్లతో కమర్షియల్ బి ల్డింగ్ నిర్మిస్తున్నామని 20 సంవత్సరాల క్రి తం కట్టి వదిలేసిన ఐడిఎస్‌ఎంటి మురికి కూ పమై అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని దాన్ని కోటిన్నరతో అభివృద్ధి చేసి ఇప్పుడు త్వరలో అందుబాటులోకి తీసుకరాబోతున్నామని టవర్ ఏరియాకు వచ్చే వారికి 100 కార్లు 300 బైకులు పార్కింగ్ చే సుకోవడానికి అందుబాటులోకి వస్తుందని 40 షెట్టర్లు ఆధునీకరించామని వాటిని అద్దెకిస్తామని ఐడిఎస్‌ఎంటి వెనుక కోటి ఇరవై లక్షలతో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామని త్వరలో శంకుస్థాపన చేస్తామని రాజీవ్ చౌక్ ను సుందరీకరించి 9 ఫీట్ల రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు.

త్వరలో ముఖ్య అతిథులచే శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు ఉం టాయని నరేందర్ రెడ్డి అన్నారు. జూన్ 1 నుండి జూన్ 15 వరకు సుడా ప్రగతి పై పక్షోత్సవాలు నిర్వహిస్తామని అందులో భాగం గా ప్రతి రోజు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలు ఉంటాయని ఏడున్నర కోట్ల నూతన పనులకు టెండర్లు పిలిచామని అవి కూడా త్వరలో శంఖుస్థాపన చేస్తామని నరేందర్ రె డ్డి అన్నారు.ఈ పక్షోత్సవాలలో అందరినీ భాగస్వాములను చేస్తామని రాబోయే రో జుల్లో ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.ఈ విలేక రుల సమావేశంలో ఎండి తాజ్, చాడగొండ బుచ్చిరెడ్డి,టేల భూమయ్య,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,గుడిపాటి రమణారెడ్డి, మిర్యాల శ్రీధర్ రెడ్డి,జువ్వాడి అమరేందర్ రావు,కుర్ర పోచయ్య,దండి రవీందర్,జీడి రమేష్, మా సుంఖాన్,తదితరులు పాల్గొన్నారు.