24 August, 2026 | 11:46 AM

Breaking News

అమెరికాలో దమ్మాయీగూడ యువకుడి విషాదాంతం   •   కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం   •   మంత్రి కొండా సురేఖ వివాదానికి సీఎం రేవంత్ చెక్ పెడతారా?   •   గోడ దూకిన ఇంటర్ విద్యార్థులు   •   భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్   •   సోయం ముందస్తు వ్యూహం.. అధిష్టానం ఆదేశాలతో పల్లెబాట   •   నిశ్చితార్థం రోజే విషాదం.. కారు ప్రమాదంలో యువకుడు మృతి   •   వర్షాలు కురుస్తలేవని కుళ్ళిన శవాన్ని తీసి మళ్ళీ ఖననం.!   •   కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్   •   మొక్కును చెల్లించుకున్న దంపతులు.. శ్రీ సీతారామచంద్ర స్వామికి వెండి కానుకలు   •  

స్ఫూర్తిదాయకం సుధనపల్లి

21-04-2026 03:21 AM

ఎస్పీ డాక్టర్ శబరీష్

మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రోడ్డు భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామ రక్షణ, గంజాయి నిర్ములనతో యూవత శ్రేయస్సుకు ప్రతీకగా నిలిచిన ‘మన ఊరు మన బాధ్యత’అర్రైవ్ అలైవ్ కార్యక్రమం అమలులో సూదనపల్లి గ్రామం స్పూర్తిగా నిలుస్తోందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అన్నారు.

సోమవారం గ్రామంలో నిర్వహించిన అరైవ్ అలైవ్  తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిషోర్ , మరిపెడ సీఐ పవన్ కుమార్, సీరోల్ ఎస్.ఐ సంతోష్ పాల్గొని గ్రామ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ సుధనపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే దిశగా మూడు కీలక తీర్మానాలను గ్రామంలో పాటిస్తునందుకు సంతోషం వ్యక్తం చేసారు.

ప్రతి ద్విచక్ర వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, గ్రామ భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, గంజాయి వంటి మత్తు పదార్థాలను పూర్తిగా నిర్మూలించి గ్రామాన్ని వ్యసన రహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న సహకారంతో 150 మంది ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడంపై ఎస్పీ గ్రామ సర్పంచ్ ను అభినందించారు. సైకిల్ వినియోగదారులకు రేడియం స్టిక్కర్లు అందించారు. గ్రామ యువతకు, స్కూల్ పిల్లలకు క్రీడా సామగ్రి పంపిణీ చేసి, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించారు. గంజాయి వినియోగం లేదా రవాణాపై సమాచారం అందించిన వారికి 5000 వరకు నగదు బహుమతి అందజేస్తామని చెప్పారు.