పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు
మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్న నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రతలు పాటించాలని, అవసరమైన సహాయం కోసం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాపిడ్ రెస్పాన్స్ టీమ్ 9441471624 నెంబర్ లో సంప్రదించవచ్చని పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ అనిత తెలిపారు.
జిల్లాలో ప్రస్తుత కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్న నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ‘వడదెబ్బ’కు గురయ్యే అవకాశం కలదని ఆమె తెలిపారు. ఎండాకాలం ప్రజలు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్ మాట్లాడుతూ వేసవి కాలంలో వచ్చే వ్యాధులపై పర్యవేక్షణకు జిల్లా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమoలో సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపిహెచ్‌ఈఓ లు కేఎల్‌ఎన్ స్వామి, తోట శ్రీనివాస్, సుపెర్వైజర్ పుష్పలత, రాజేందర్, అశ్విని, అరుణ, ఆరోగ్య కార్యకర్తలు, పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.






