12 May, 2026 | 9:59 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

ఒకేరోజు మిలిటరీ దంపతుల సూసైడ్!

18-10-2024 01:01 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ఇండియన్ మిలిటరీలో పనిచేస్తున్న దంపతులు ఒకేరోజు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. కాగా ఈ దంపతులు వేర్వేరు నగరాల్లో ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దీన్‌దయాళ్ దీప్ (32) ఐఏఎఫ్ ఫ్లుటై లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆగ్రాలోని సైనిక ఆస్పత్రిలో దీప్ భార్య రేణు తన్వర్ ఆర్మీలో కెప్టెన్‌గా పనిచేస్తుంది. కాగా తన్వర్ తల్లి, సోదరుడికి ట్రీట్‌మెంట్ చేయించాడానికి ఢిలీకి వెళ్లింది. ఇంతలోనే భార్యభర్తలిద్దరూ అనుమానాస్పదంగా సూసైడ్ చేసుకున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ ఉరేసుకొని చనిపోయాడు. అదే రోజు రాత్రి తన్వర్ ఢిల్లీ కంటోన్మెంట్‌లోని అధికారుల మెస్ హాల్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.