27 June, 2026 | 9:26 PM

అట్టహాసంగా ప్రమాణస్వీకారోత్సవం..!

27-06-2026 08:25 PM

మార్కెట్ కమిటీలు రైతులకు అండగా ఉండాలీ

మార్కెట్ కమిటీ చైర్మన్ గా సుకుమారి  బాధ్యతలు

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ సముదాయంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రమాణస్వీకారంతో పండుగ వాతావరణం నెలకొంది. బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా శరత్నం సుకుమారి, వైస్ చైర్మన్‌గా ఎస్. రవీందర్ రావు  పదవీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. మార్కెట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన రత్నం సుకుమారి నీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి శాలువతో కప్పి ఘనంగా సత్కరించారు.

అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ భాగంగా ఏఎంసీ చౌరస్తాలో ఉన్న మాజీ కేంద్ర మంత్రి, దివంగత ప్రజానేత గడ్డం వెంకటస్వామి (కాకా) విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే కాంట అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి  ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయానికి చేరుకున్నారు.

- మార్కెట్ చైర్మన్ గా సుకుమారి

బెల్లంపల్లి మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో  పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ  చైర్మన్గా  రత్నం సుకుమారి, వైస్ చైర్మన్ ఎస్. రవీందర్ రావు ,కమిటీ సభ్యులు పదవీ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం  సంతకం చేసి సుకుమారి పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. ఎల్లవేళ రైతులకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని వెల్లడించారు. రైతుల కష్ట సుఖాల్లో పాలుపంచుకొని అండగా ఉంటానన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ... రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమన్నారు.. రైతులకు గిట్టుబాటు ధర, పారదర్శకమైన సేవలు, మెరుగైన సౌకర్యాలు అందేలా వ్యవసాయ మార్కెట్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలనీ హితువు పలికారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులు రైతుల ప్రయోజనాల కోసం నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని పునరుద్ఘాటించారు. మార్కెట్ కమిటీని ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దాలని" సూచించారు.