17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అవినీతి అనకొండ సునీల్‌రావు

26-06-2025 12:53 AM

కరీంనగర్ క్రైం, జూన్25(విజయక్రాంతి):మాజీమంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ను విమర్శించే స్థాయి అవినీతి అనకొండ సునీల్ రావుకు లేదన్నారు బిఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్.అధికార దాహం కోసం పార్టీలు మారి...అధికారం అనుభవించి ఆస్తులు సంపాదించుకున్నాక.. నమ్ముకున్నోళ్ళను నట్టేట ముంచే రకం సునీల్ రావు దని విమర్శించారు.

గతంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బండి సంజయ్ ఒక్క రూపాయి తేలేదని మీడియా సాక్షిగా చెప్పిన సునీల్ రావు నేడు కరీంనగర్ అభివృద్ధి అంతా బండి సంజయ్ చేశాడనడం హాస్యాస్పదం అన్నారు.బిఆర్‌ఎస్ పార్టీ మేయర్ గా ఐదు సంవత్సరాలు ఉండి బిఆర్‌ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టిన ఘనత సునీల్ రావుదని విమర్శించారు. మేయర్ గా ఐదు సంవత్సరాల కాలంలో ఎంత సంపాదించావో..

విదేశాల్లో కూడబెట్టిన ఆస్తులతో సహా నీ బండరాన్ని త్వరలో బయటపెడతామన్నారు.కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చింది వినోద్ కుమార్ అని స్మార్ట్ సిటీ వచ్చినప్పుడు బండి సంజయ్ కుమార్ కార్పొరేటర్ గా ఉన్నాడని ఎన్నో సందర్భాల్లో చెప్పిన నీవు ఈరోజు బండి సంజయ్ జపం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గంగులకు నీకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీవా గంగులను విమర్శించేది.

నీ అవినీతి సంపాధన నీవు ఏ విధంగా సంపాదించినవో ప్రజలకు అర్థం అవుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ద్వితీయ శ్రేణి నాయకులు లేక ఊసరవెల్లి సునీల్ రావును చేర్చుకొని ఆయనతో మీడియా సమావేశం పెట్టించే స్థాయికి దిగజారడని విమర్శించారు.

కరీంనగర్ పట్టణ ప్రజలకు గుదిబండగా మారిన డంపింగ్ యార్డ్ సమస్య ను తీరుస్తా అని నేటికీ తీరకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా.. కెసిఆర్ ను కేటీఆర్ ను విమర్శించకుండా.. నీ చుట్టూ ఉన్న అవినీతి నాయకులను పక్కనపెట్టి ఇప్పటికైనా కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధిపై కృషి చేయాలని బండి సంజయ్‌కిసూచించారు.